![]() |
![]() |
.webp)
ఆలీతో ఆల్ ఇన్ వన్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ షోకి మానస్, ఆర్జే కాజల్, హమీదా ఖాతూన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక మానస్ స్టేజి మీదకు డాన్స్ చేసుకుంటూ వచ్చాడు. "ఎందుకు లవ్ మ్యారేజ్ ట్రై చేయలేదు ?" అని ఆలీ మానస్ ని అడిగాడు. "సెట్ అవలేదు సర్" అని చెప్పాడు మానస్.. " సెట్ అవలేదా, మీ అమ్మగారు సెట్ చేయలేదా" అని ఆలీ కౌంటర్ వేసేసరికి మానస్ నవ్వేసాడు. "ఎన్ని పనులున్నా సరే నాకు ఫోన్ వచ్చేస్తుంది..తిన్నావా అని" అని మళ్ళీ చెప్పాడు మానస్.
పొరపాటున ఫోన్ లిఫ్ట్ చేయకపోతే "ఏరా బలిసిందా" అని అంటుంది అంటూ వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు మానస్. ఓహ్ ఐతే "అమ్మా నాన్న ఓ తమిళమ్మాయా" అని కౌంటర్ వేసాడు ఆలీ. సీరియల్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్ నాగులపల్లి, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యాడు. అతడి ఆటతీరుకు బుల్లి తెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ తర్వాత మళ్లీ సీరియల్స్ లో బిజీ అయ్యాడు.
విష్ణుప్రియతో కలిసి కొన్ని ఆల్బమ్స్ తో పాటు షోలు కూడా చేసాడు. రీసెంట్ గా శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు మానస్. ఇక మానస్ తర్వాత ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చింది. "సర్ మా నాన్న మీ ఫ్రెండ్..చిన్నప్పుడు మనం పెళ్ళిలో కూడా కలిసాం " అని అలీతో కాజల్ చెప్పేసరికి " అప్పుడు నేను కూడా చాలా చిన్నోడిని" అని ఆలీ చెప్పేసరికి కాజల్ షాకయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానులకు బాగా దగ్గరయింది. ఇక ఫైనల్ గా హమీదా ఒక రకమైన నీలం రంగు డ్రెస్ వేసుకుని స్టేజి మీదకు డాన్స్ చేస్తూ వచ్చింది. ఆలీ ఆమె డ్రెస్ ని చూసి "ఇప్పుడు ఈ డ్రెస్ పేరేమిటి" అనేసరికి "బ్లూ డ్రెస్" అని చెప్పింది హమీద. ఇలా ఈవారం వీళ్ళందరూ కలిసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు.
![]() |
![]() |